ధర్మరాజు సూర్యుడిని ప్రార్థించి ఏం పొందారో తెలుసా?

సూర్యుడి విశిష్టత ఏంటనేది హిందువులందరికీ బాగానే తెలుసు. అందుకే ఉదయాన్నే చాలా మంది సూర్యుడికి అర్ఘ్యమిస్తూ ఉంటారు. సూర్య నమస్కారం చేశాక కానీ వారి దినచర్యను ప్రారంభించారు. తాజాగా వేద పండితులు సూర్యుని విశిష్టతను తెలియజేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సమాజ క్షేమం, దేశ సౌభాగ్యాన్ని కాంక్షిస్తూ సూర్యారాధన చేశారు. ఆదిత్య యంత్రాన్ని ఏర్పాటు చేసి మరీ ప్రత్యక్ష భగవానుడిని పవన్ వేద మంత్రోచ్ఛారణల నడుమ పూజ నిర్వహించారు. ప్రతి రోజూ సూర్య నమస్కారాలు చేసే పవన్ గత కొంత కాలంగా వెన్ను నొప్పి కారణంగా చేయడం లేదు. ఈ క్రమంలోనే ఆదిత్య ఆరాధనను వారాహి దీక్షలో భాగంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా సూర్యుడిని యంత్రం ఏర్పాటు చేసి మరీ పవన్ పూజించారు. ఈ సందర్భంగా వేద పండితులు సూర్యుడి విశిష్టతను తెలియజేశారు. సూర్య నమస్కారాలు ప్రజల జీవన విధానంలో భాగమని.. వనవాసంలో ధర్మరాజు సూర్యుడిని ప్రార్థించే అక్షయ పాత్ర పొందారని మహా భారతం చెబుతోందన్నారు. అసలు మన సంస్కృతిలో ఆదివారానికి అత్యంత ప్రాధాన్యత ఉందన్నారు. బ్రిటీష్ పాలకుల కారణంగా అది సెలవు దినంగా మారిపోయిందన్నారు. వాస్తవానికి ఆదివారాన్ని రవివారం అని పిలుస్తారని.. ఇది సూర్యుడికి అత్యంత ఇష్టమైన రోజని తెలిపారు. గతంలో ఆదివారం సూర్యుడిని ఆరాధించుకున్న మీదటే ఏ పని అయినా నిర్వహించే వారని వేద పండితులు తెలిపారు.

Share this post with your friends