ముక్కోటి దేవతలు పాల్గొనే ఉత్సవమేంటో తెలుసా?

టైటిల్ చూడగానే ఆశ్చర్యం అనిపించక మానదు. నిజంగా ఏదైనా ఉత్సవంలో ముక్కోటి దేవతలు పాల్గొంటారా? అంటే తప్పక పాల్గొంటారు. అది మనందరికీ తెలిసిన ఉత్సవమే. పైగా దేశం యావత్తు నేరుగానో టెలివిజన్ ఛానళ్లలోనో అత్యంత ఆసక్తిగా ఈ ఉత్సవాన్ని తిలకిస్తారు. అదేంటంటే పూరి జగన్నాథుని రథ యాత్ర. ఈ ఉత్సవాలను తిలకించేందుకు దేశ, విదేశాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున హాజరవుతూ ఉంటారు. జగన్నాథుని రథం తాకితేనే అదృష్టమని భావిస్తూ ఉంటారు. అలాంటిది రథం లాగితే మన జీవితంలోని పాపాలతో పాటు కష్టాలన్నీ మాయమవుతాయట. అందుకే జగన్నాథుని రథం లాగేందుకు భక్తులు పోటీ పడుతుంటారు.

ఇక ఈ రథ యాత్రలో ముక్కోటి దేవతలు పాల్గొంటారని పండితులు చెబుతారు. కాబట్టి ఈ రథాన్ని తాకడమంటే ముక్కోటి దేవతలను తాకడమేనని అంటారు. అందుకే భక్తులు రథం లాగేందుకు పోటీ పడతారు. ఈ రథ యాత్రలో మూడు రథాలుంటాయి. వీటిని వేప చెక్కతో తయారు చేస్తారు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ మూడు రథాలు లోపలి భాగాన్ని దాదాపు 208 కిలోల బంగారంతో అలంకరిస్తారు. ఈ రథం తయారీకి కానీ.. రథంలో కానీ ఇనుమును వినియోగించరు. చెక్క సుత్తులను మాత్రమే ఉపయోగిస్తారు. అలాగే ఈ రథాల తయారీలో టెక్నాలజీకి చోటుండదు. కేవలం చేతి పనితోనే రథం తయారవుతుంది.

Share this post with your friends