మీ రాశికి సంబంధించిన బీజాక్షర మంత్రం గురించి మీకు తెలుసా?

ప్రస్తుతం బాసరలో బీజాక్షరాల వివాదం ముదిరి పాకాన పడుతోంది. అక్కడైతే బీజాక్షరం వ్యాపారంగా మారిందనే ఆరోపణలు అయితే వినవస్తున్నాయి. కాసేపు ఈ విషయాన్ని పక్కన పెడితే.. వాస్తవానికి బీజాక్షర మంత్రాలు మన శరీరంలోని చక్రాలను ఉత్తేయపరుస్తాయట. తద్వారా అవి సజావుగా పని చేసేలా శక్తిని ఇస్తాయట. ఒకే ఒక్క అక్షరంతో కూడిన మంత్రాన్ని సూచించేదే బీజాక్షరమని చెబుతారు. ఈ బీజాక్షర మంత్రాన్ని పటిస్తే శరీరంలో ఆత్మ, ప్రాణశక్తి పెరుగుతుందట. కాబట్టి దీనికి ఇతర మంత్రాల కంటే కూడా శక్తి ఎక్కువేనని పండితులు చెబుతారు. అయితే రాశికో బీజాక్షరం ఉంటుంది. ఆయా రాశుల వారు తమ రాశికి సంబంధించిన మంత్రాన్ని పఠిస్తే జ్ఞాన శక్తి పెంపొందుతుందట. అంతేకాకుండా శరీరంలోని చక్రాలు ఉత్తేజమవుతాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ఆ 12 రాశుల వారి బీజాక్షర మంత్రాలేంటో చూద్దాం.

12 రాశుల వారి బీజాక్షరాలు..

మేషం – ఓం ఐం క్లీం సౌం
వృషభం – ఓం ఐం క్లీం శ్రీం
మిథునం – ఓం క్లీం ఐం సౌం
కర్కాటకం – ఓం ఐం గ్లీం శ్రీం
సింహం – ఓం హ్రీం శ్రీం సౌం
కన్య – ఓం శ్రీం ఐం సౌం
తుల – ఓం హ్రీం క్లీం శ్రీం
వృశ్చికం – ఓం ఐం క్లీం సౌం
ధనుస్సు – ఓం హ్రీం క్లీం సౌం
మకరం – ఓం ఐం క్లీం హ్రీం శ్రీం సౌం
కుంభం – ఓం హ్రీం ఐం క్లీం శ్రీం
మీనం – ఓం హ్రీం ఐం క్లీం శ్రీం..

Share this post with your friends