శ్రీచక్రం గురించి తెలుసా? దీని ప్రతిష్టాపన నియమాలేంటంటే..

డబ్బు సంపాదన కోసం ఎన్నో తిప్పలు పడుతూ ఉంటారు. కొందరికి మాత్రం పెద్దగా కష్టపడాల్సిన పని లేకుండానే డబ్బు వచ్చేస్తూ ఉంటుంది. అది వారి అదృష్టంలే అని సరిపెట్టుకుంటూ ఉంటాం. అయితే కొన్ని నియమాలు, పరిహారాలు పాటిస్తే మన ఇంట కూడా సిరుల పంట పండుతుందని పండితులు చెబుతున్నారు. మన ఇల్లు నిత్యం సిరిసంపదలతో తుల తూగాలంటే.. శ్రీ చక్రాన్ని ప్రతిష్టించుకోవాలట. ఇది చాలా శక్తిమంతమైనదని అంటారు. కాబట్టి దీని ప్రతిష్టాపన ఎలా పడితే అలా చేయకూడదట. కొన్ని నియమాలను తప్పక పాటించాలట. ఆ నియమాలేంటో చూద్దాం.

శ్రీచక్రం ప్రతిష్ఠకు నియమాలు..

శ్రీచక్రాన్ని ఎర్రటి పట్టు వస్త్రంలో ఉంచి ముందుగా పంచామృతాలతో అభిషేకించి.. పసుపు, కుంకుమలతో, అక్షింతలతో పూజించాలి. 108 ఎర్రటి పువ్వులతో శ్రీలక్ష్మి అష్టోత్తర శతనామాలు చదువుతూ లక్ష్మీదేవిని పూజించాలి. కనీసం10 నిమిషాల పాటు కళ్లు మూసుకుని లక్ష్మీదేవిని మనసులో స్థిరంగా నిలుపుకుని ధ్యానం చేయాలి. ఈ సమయంలో మనసు పూజ మీదనే లఘ్నమయ్యేలా చూసుకోవాలి. ఈ సమయంలో మన ఆర్థిక కష్టాలతో పాటు కోరికలను అమ్మవారి ముందు ఉంచాలట. ధ్యానం పూర్తయ్యాక ధూప దీపాలతో శ్రీచక్రాన్ని పూజించి నమస్కరించుకోవాలి. దీంతో పూజ పూర్తవుతుంది. అప్పుడు అమ్మవారికి ఇష్టమైన పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి. చివరిగా కొబ్బరి కాయ కొట్టి నమస్కరించుకుని శ్రీచక్రాన్ని ఎర్రటి వస్త్రంతో సహా ఇంటి సింహద్వారం పైన కట్టుకోవాలి.

Share this post with your friends