గంగా దసరా గురించి తెలుసా? అదెప్పుడంటే..

గంగా దసరా గురించి చాలా మందికి తెలిసి ఉండదు. హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలోని శుక్ల పక్షంలోని పదవ రోజున గంగా దసరాను జరుపుకుంటాం. ఇక గంగా దసరా పేరులోనే ఉంది కదా.. ఈ రోజున గంగామాతను పూజిస్తాం. గంగమ్మ ప్రకారం వైశాఖ మాసంలోని శుక్ల పక్షంలోని పదవ రోజున భూమిపై ఉద్భవించింది. కాబట్టి ఆ రోజును మనం గంగా దసరాగా జరుపుకుంటాం. ఈ రోజున గంగానదిలో స్నానమాచరిస్తే మనం చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని నమ్మకం. ఈ ఏడాది గంగా దసరా ఎప్పుడంటారా? జూన్ 16వ తేదీన. క్యాలెండర్ ప్రకారమైతే మాసం శుక్ల పక్ష దశమి తిథి జూన్ 16 మధ్యాహ్నం 2:32 గంటలకు ప్రారంభమై జూన్ 17 ఉదయం 4:45 గంటలకు ముగుస్తుంది. కాబట్టి జూన్ 16ను గంగా దసరాగా జరుపుకుంటాం.

అయితే గంగ స్నానం ఎప్పుడు చేస్తే ఫలితం మరింత బాగుంటుందంటే.. జూన్ 16న ఉదయం 4:03 నుంచి 4:45 వరకు బ్రహ్మ ముహూర్తం ఉంటుంది. అంతేకాకుండా ఈ రోజున రవియోగం, సర్వార్థ సిద్ధి యోగం, అమృత సిద్ధి యోగం కూడా ఏర్పడుతుండటం మరింత కలిసొచ్చే అంశాలు. ఈ యోగాలు.. పూజకు, స్నానానికి, దానానికి అత్యంత ప్రీతికరమైన సమయంగా పరిగణించబడుతున్నాయి. గంగా దసరా నాడు తెల్లవారుజామునే నిద్ర లేచి స్నానం చేయాలి. నది వద్ద స్నానం చేసే వీలు లేని వారు ఇంటి వద్ద అయినా గంగా జలం కలిపిన నీటితో స్నానం చేయండి. ఆ తరువాత సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించి అనంతరం గంగాదేవి, శివుడిని పూజించాలి. ఆపై గంగా స్తోత్రాన్ని పఠించి, చివరగా గంగాదేవికి హారతి ఇస్తే పూజ సంపూర్ణంగా ముగిసినట్టే.

Share this post with your friends