ఇల్లు అనేది చాలా అవసరం. అయితే పుణ్య ప్రదేశాలకు వెళ్లినప్పుడు రాళ్లు పేరిస్తే ఇల్లు కడతామని అంటారు. అనడమే కాదు.. చాలా మంది పెద్ద ఎత్తున రాళ్లు పేరుస్తారు. అలా పేరిస్తే ధనశక్తి పారే జలపాతంలా వచ్చేస్తుందని నమ్మకం. ఎవరికైనా సరే.. సొంత ఇంటి ఆలోచన అనేది వయసులో ఉన్నప్పుడు పెద్దగా ఉండదని.. వృద్ధాప్యంలో మాత్రం ఇంటి అవసరం తెలుస్తుందంటారు. కాబట్టి వృద్ధాప్యం వరకూ ఆగకుండా సొంత ఇంటి దిశగా ప్రయత్నం చేయమని దాని అర్థమట.
పుణ్య ప్రదేశాలలో రాళ్లు పేరిస్తే గృహ యోగం కలుగుతుందని చాలా మంది నమ్ముతారు. అయితే అలా జరిగిన దాఖలాలు అయితే ఉండవు కానీ మనసు మాత్రం సొంత ఇంటి పైకి మళ్లుతుంది. ఎవరో ఒకరు ఇలాంటివి మొదలు పెడితే.. ఇక చాలా మంది అనుసరిస్తూ ఉంటారు. చివరికి ఇదో సంప్రదాయమవుతుంది. అంతే కానీ రాళ్లు పేర్చినంత మాత్రాన ఇల్లు అయితే కట్టము. కేవలం సొంత ఇంటి ఆలోచన చేస్తామంతే.. తద్వారా ఇల్లు కట్టుకుంటే కట్టుకోవచ్చు. దేవాలయ ఆవరణలో చెట్లకు ఊయల కట్టడం కూడా ఇలాంటిదేనని అంటారు. దేవుడి సన్నిధిలో చేస్తే తప్పక నెరవేరుతుందని ఓ నమ్మకం.