నవగ్రహాల్లో శనీశ్వరుడిని గ్రహాలకు అధిపతిగానే కాకుండా కర్మ ప్రధాతగా భావిస్తుంటారు. సూర్య భగవానుడు, ఛాయాదేవిల తనయుడే శనీశ్వరుడు. ఈశ్వరునికి ప్రియ భక్తుడు. మనం చేసే పనుల కారణంగా కర్మల ఫలితాలను అందిస్తూ ఉంటాడు. ఇక శనీశ్వరుడి ప్రభావం ఎవరి జాతకంలో ఉన్నా వారికి కష్ట, నష్టాలు తప్పవంటారు. ఎవరి జాతకంలో శని నీచ స్థానంలో ఉంటాడో వారికి కష్టనష్టాలు తప్పవని అంటారు. మరి ఏలిన నాటి శని ప్రభావముంటే ఏం చేయాలి? నివారణా చర్యలేంటి? చూద్దాం.
ఏలిన నాటి శని, అర్థాష్టమ శని, వారాంత శనితో కొందరు బాధపడుతూ ఉంటారు. ఇలాంటి వారు శనీశ్వరుడికి పూజలు చూస్తే వాటి నుంచి విముక్తి కలుగుతుందట. శనీశ్వరుడి అనుగ్రహం కోసం ప్రతి శనివారం తైలాభిషేకం చేయడంతో పాటు నలుపు రంగు దుస్తులను, నల్ల నువ్వులను సమర్పించాలి. ఇలా 11 వారాలు చేస్తే ఇబ్బందులన్నీ తొలిగిపోయని నమ్మకం. అలాగే శనీశ్వరుడికి అత్యంత ఇష్టమైన వస్తువులను పొరపాటున కూడా శనివారం రోజున ఇంటికి తీసుకు రాకూడదట. అవేంటంటే.. నువ్వుల నూనె, చెప్పులు, ఉప్పు, కారం, నవధాన్యాలు.