ఈ మొక్కను ఇంట్లో నాటితే తప్పక జాగ్రత్తలు పాటించాల్సిందే..

దసరా రోజున జమ్మి చెట్టును పూజిస్తూ ఉంటాం. అయితే కొందరు మంచిదని ఈ చెట్టును ఇంట్లో కూడా పెంచుకుంటూ ఉంటారు. జమ్మి చెట్టును నియమ నిష్టలతో పూజిస్తే దేవానుగ్రహం తప్పక లభిస్తుందట. పైగా ఇంట్లో ఉండటం వలన నెగిటివిటీ తొలగిపోతుందని నమ్మకం. ఈ చెట్టు శివునికి చాలా ఇష్టమైనదట. దీనిలో శనీశ్వరుడు నివసిస్తాడని నమ్మకం. ముఖ్యంగా ఏలిన నాటి శని ప్రభావంతో బాధపడేవారు ఈ జమ్మి చెట్టును పూజిస్తే ఇబ్బందులు తొలగుతాయట. జమ్మి ఆకులతో వినాయకుడిని పూజించినా కూడా శనిదోషం తగ్గుతుందట.

శని దేవుడికి జమ్మి ఆకులను సమర్పిస్తే మంచి ఫలితం దక్కుతుందట. శివునికి సమర్పిస్తే కష్టాలు తొలగుతాయట. వినాయకుడికి సమర్పిస్తే సత్ఫలితాలు ఉంటాయట. ఇంతటి మహిమ కలిగిన ఈ మొక్కను ఇంట్లో పెంచుకోవాలనుకుంటే మాత్రం సరైన దిశలోనే పెంచుకోవాలట. ఇలా చేస్తే ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కుతామట. ఇక జమ్మి మొక్కను ఇంట్లో ఏ దిశలో నాటాలంటే.. ఈశాన్య మూలలో నాటాలి. ఇలా నాటితో ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి తద్వారా ఆర్థిక సమస్యలు ఉండవట. అయితే శమి మొక్క పెంచే ప్రాంతం ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండాలట. ఆ పరిసరాల్లో చెప్పులు, షూ వంటివి పెట్టకూడదట.

Share this post with your friends