తిరుపతిలో కొలువైన శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు మే 16 నుంచి ప్రారంభం కానున్నాయి. మే 24వ తేదీ వరకూ స్వామివారి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. మే 15వ తేదీ సాయంత్రం అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలను ప్రారంభించనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం 7 నుంచి 9 గంటల వరకూ.. అలాగే రాత్రి 7 నుంచి 9 గంటల వరకూ వాహనసేవలు జరుగనున్నాయి.
బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :
16-05-2024
ఉదయం – ధ్వజారోహణం
రాత్రి – పెద్దశేష వాహనం
17-05-2024
ఉదయం – చిన్నశేష వాహనం
రాత్రి – హంస వాహనం
18-05-2024
ఉదయం – సింహ వాహనం
రాత్రి – ముత్యపుపందిరి వాహనం
19-05-2024
ఉదయం – కల్పవృక్ష వాహనం
రాత్రి – సర్వభూపాల వాహనం
20-05-2024
ఉదయం – మోహినీ అవతారం
రాత్రి – గరుడ వాహనం
21-05-2024
ఉదయం – హనుమంత వాహనం
రాత్రి – గజ వాహనం
22-05-2024
ఉదయం – సూర్యప్రభ వాహనం
రాత్రి – చంద్రప్రభ వాహనం
23-05-2024
ఉదయం – రథోత్సవం
రాత్రి – అశ్వవాహనం
24-05-2024
ఉదయం – చక్రస్నానం
రాత్రి – ధ్వజావరోహణం