ఈ ఒక్కరోజున తులసిని పూజిస్తే అన్ని లాభాలా?

ప్రతి ఇంటా తులసి మొక్క దాదాపు ఉంటుంది. హిందువులు ప్రతి రోజూ ఉదయం తులసి మొక్కకు పూజలు నిర్వహిస్తూ ఉంటారు. తులసి మొక్కలో లక్ష్మీదేవి, విష్ణుమూర్తి ఉంటారని నమ్మకం. తులసిని పూజిస్తే విష్ణుమూర్తి తొందరగా ప్రసన్నుడై కోరిన కోరికలు తీరుస్తాడట. ఇలా ముఖ్యంగా గురువారం తులసి మాతను పూజిస్తే ఆదాయం, అదృష్టంతో పాటు కష్టాల నుంచి గట్టెక్కుతారట. ఇంట్లోని స్త్రీలు ప్రతిరోజూ ఉదయాన్నే శుచిగా స్నానం చేసి.. ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత బయట ఉన్న తులసి మాతను సైతం పూజిస్తూ ఉంటారు. ఇక మిగిలిన రోజుల కన్నా గురువారం తులిశమ్మను పూజిస్తే ఫలితం మరింత ప్రభావవంతంగా ఉంటుందట.

ప్రతి గురువారం సాయంత్రం తులసి మాత ముందు నెయ్యి దీపారాధన చేస్తే చాలా మంచిదట. నెయ్యి దీపాలు వెలిగించిన అనంతరం తులసి మాతకు హారతి ఇచ్చి ఆ తరువాత తులసి చాలీసా పఠించాలి. ఇలా చేస్తే ఇంట్లో ఆనందం, ఐశ్వర్యం, సౌభాగ్యం కలుగుతాయి. ఈ రోజున తులసి మొక్కను పూజిస్తే తులసిమాత అనుగ్రహంతో పాటు విష్ణుమూర్తి అనుగ్రహం కూడా లభిస్తుందట. గురువారాన్ని లక్ష్మీవారం అని కూడా అంటారు కాబట్టి. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మనపై ఉంటుంది. ఈ ఒక్కరోజు తులసి మాతను పూజించడం వలన సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. అలాగే అదృష్టం కలసి వస్తుందట. ఎలాంటి కష్టం నుంచైనా బయటపడతామట.

Share this post with your friends