సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానంలో ఈనెల 10వ తేదీన జరగనున్న స్వామి వారి చందనోత్సవం నిజరూప దర్శన భాగ్యం భక్తులందరికీ ప్రశాంతంగా లభించేలా ఏర్పాటులు చేయాలని దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి… కరికల్ వలన్ ఐఏఎస్ ఆదేశించారు. ఈ సంవత్సరం చందనోత్సవం పై ఆయన ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు సోమవారం సింహాచలం క్షేత్రంలో ఆయన పర్యటించారు కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున జీవీఎంసీ కమిషనర్ సాయి కాంత్ వర్మ ఇఓ శ్రీనివాస్ మూర్తి ఇతర అధికారులతో ఆయన ప్రత్యేక భేటీ అయ్యారు ఆలయంలో రూ:300, 1000రూ; 1500 రూ; క్యూలైన్ లు ఆలయములో భక్తుల దర్శనానికి వెళ్లే మార్గాలను అడుగడుగు క్షుణ్ణంగా పరిశీలించారు లోటుపాట్లను గమనించి అధికారులకు సూచించారు.
ఏ ఒక్క భక్తుడికి అసౌకర్యం కలగకుండా శీఘ్ర దర్శనం అలాగే తరలివచ్చే వేలాది మంది కోసం కనీస సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ను కలిగి ఉండాలని తెలిపారు . ఈ సందర్భంగా ఉచిత లైన్లో వెళ్లే భక్తులకు పెద్దపీట వేయాలని ఆయన సూచించారు ఈ ఏడాది చందనోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుందని ఆయన నమ్మకాన్ని వ్యక్తం చేశారు జిల్లా అధికారులు ఆయనకు ఇక్కడ ఏర్పాట్లపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇప్పటివరకు జరిగిన ఏర్పాట్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు ఈవో శ్రీనివాసమూర్తి ని అభినందించారు. ఈ ఈ శ్రీనివాసరాజు రాంబాబు ఇతర అధికారులు పాల్గొన్నారు.