పురాణాల ప్రకారం మనం తీసుకునే ఆహారాలు ఎన్ని రకాలు?

మనకు తెలిసి ఆహారం రెండే రకాలు.. అవేంటంటే శాఖాహారం, మాంసాహారం. కానీ పురాణాలు మాత్రం మూడు రకాల ఆహారాలను సూచిస్తున్నాయి. పూజ వంటి పవిత్ర కార్యాలేమీ లేనప్పుుడు మనం తీసుకునే ఆహారం వేరుగా ఉంటుంది. పూజా సమయంలో తీసుకునే ఆహారం వేరుగా ఉంటుంది. మరి పురాణాల్లో చెప్పిన మూడు రకాల ఆహారాలు ఏంటి అంటారా? సాత్విక ఆహారం, రాజస ఆహారం, తామసిక ఆహారం. ఈ మూడు ఆహారాల్లో వేటి కిందకు ఏమేం వస్తాయో చూద్దాం.

సాత్విక ఆహారం: పూర్తిగా సత్వగుణాన్ని కలిగి ఉండే ఆహారాన్ని సాత్విక ఆహారమని అంటారు. వీటిలో పాలు, నెయ్యి, పిండి, పచ్చి కూరగాయలు, పండ్లు మొదలైన వాటిని సాత్విక ఆహారంగా పరిగణిస్తారు. ఈ సాత్విక ఆహారాన్ని తీసుకుంటే పాజిటివ్ ఎనర్జీ వస్తుందని అంటారు.

రాజస ఆహారం: మసాలా దినుసులతో తయారు చేసే ఆహారాన్ని రాజస ఆహారమని అంటారు. ముఖ్యంగా మాంసాహారంలో మసాలా దినుసులు వినియోగిస్తారు. కాబట్టి మాంసాహారాన్ని రాజస ఆహారమని అంటారు.

తామసిక ఆహారం: మనం తీసుకునే ఆహారం కారణంగా కొన్ని సార్లు రక్త ప్రవాహంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. దీనిని తామసిక ఆహారమని అంటారు. ఇలాంటి ఆహారం తీసుకుంటే కోపంతో పాటు టెన్షన్‌కు గురవుతుంటామట. తామసిక ఆహారంలోనే ఉల్లిపాయ, వెల్లుల్లిని చేర్చారు. ఈ ఆహారాన్ని పూజల సమయంలో తీససుకోకూడదట.

Share this post with your friends