ఏఏ దేవుళ్లను ఏఏ పూలతో పూజించాలో తెలుసా?

మనం దేవుడిని పూజించే సమయంలో కానీ.. గుడికి వెళ్లినప్పుడు కానీ తప్పక పూలను తీసుకెళతాం. అయితే ఒక్కో దేవుడిని.. ఒక్కో రకమైన పువ్వులతో పూజించాలి. మరి ఏ ఏ దేవుళ్లను ఏ ఏ పూజలతో పూజించాలో కొందరికి మాత్రమే తెలుసు. ఆ లెక్కెంటో చూద్దాం. ముందుగా నేలపాలైన పుష్పాలు కానీ.. వాసన చూసిన.. కడిగిన పుష్పాలను పూజకు వినియోగించకూడదు. అలాగే దేవుడి పూజలో వినియోగించే పూలను శుచిగా స్నానమాచరించిన మీదటే కోయాలి. ఇక శ్రీ మహావిష్ణువును తులసి దళాలతో పూజించాలి.

శ్రీమహాలక్ష్మిని తామర పువ్వులతో పూజించాలి. అలాగే ఎర్రని పుష్పాలన్నీ అమ్మవారికి చాలా ఇష్టం. వాటితో పూజిస్తే అమ్మవారు అమితానందం పొందుతారట. సూర్యభగవానుడ్ని, విఘ్నేశ్వరుని తెల్లజిల్లేడు పువ్వులతోనూ.. గాయత్రిదేవిని ‘మల్లిక’, ‘పొగడ’, ‘కుశమంజరి’, ‘మందార’, ‘మాధవి’, జిల్లేడు, ‘కదంబ’, ‘పున్నాగ’, ‘చంపక’, గరిక పుష్పాలతో పూజించాలి. మహాశివునికి మారేడు దళాలంటే అత్యంత ఇష్టం. కాబట్టి మారేడు దళాలతో పూజిస్తే కోరిన కోరికలు తప్పక నెరవేరుతాయట. ‘శ్రీచక్రాన్ని’ తామరపువ్వులు, తులసి దళాలు, కలవ పూలు, జాజి, మల్లె, ఎర్రగన్నేరు, ఎర్ర కలువపూలు, గురువింద పుష్పాలతో పూజించాలి.

Share this post with your friends