హనుమంతుడికి తమలపాకులతో పాటు పువ్వులంటే కూడా చాలా ఇష్టం అంటారు. తమలపాకులంటే ఎందుకు ఇష్టమో తెలుసుకున్నాం. తనకు తగిలిన గాయాల నుంచి సేద తీర్చాయి కాబట్టి తమలపాకులంటే ఇష్టమని చెబుతుంటారు. మరి పువ్వులంటే ఎందుకు అంత ఇష్టం? దీనికి మరో రెండు కథలు కూడా ఉన్నాయి. ఇక ఆంజనేయ స్వామికి సింధూరం అంటే చాలా ఇష్టం. హనుమంతుడిని ఏ ఆలయంలో చూసినా కూడా ఒంటి నిండా సింధూరంతోదర్శనమిస్తాడు. భక్తులు స్వామిని పూజించి సింధూరం సమర్పిస్తే ఆయన సంతోషించి కోరిక కోరికలు తీరుస్తాడని నమ్మకం. మరి సింధూరం హనుమంతుడికి ఎందుకంత ఇష్టం?
ఒకసారి సీతమ్మను హనుమంతుడు అమ్మా నీ నుదుటిపై సింధూరం ఎందుకు పెట్టుకుంటావని అడిగాడట. దీనికి సమాధానంగా సీతమ్మ.. తన భర్త అయిన శ్రీరాముడి దీర్ఘాయువుతో పాటు మంచి ఆరోగ్యం కోసం సింధూరం ధరిస్తానని చెప్పిందట. ఈ సమాధానం విన్న ఆంజనేయ స్వామి తనకు ఆరాధ్య దైవమైన కోదండ రాముడు సింధూరం ధరించడంతోనే ఆయురారోగ్యాలతో చల్లగా ఉండేలా అయితే తాను శరీరమంతా ధరిస్తానని చెప్పాడట. అప్పటి నుంచి ఆంజనేయ స్వామి ఒంటి నిండా సింధూరం ధరించడం ప్రారంభించాడట. దీన్ని బట్టి చూస్తే హనుమంతుడి ప్రతి పనిలోనూ రామయ్య తండ్రి గురించి ఆలోచన తప్పక ఉంటుంది.
శాపానికి ఉపశమనంగా హనుమంతుడు జన్మించాడట..