వేములవాడలో మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శివ కల్యాణ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన రథోత్సవం నేత్రపర్వంగా కొనసాగింది. పూజాధికాల అనంతరం సుందరంగా అలంకరించిన రథంపై కొలువుదీరిన స్వామివార్లు భక్తులను కటాక్షించారు. శివ కల్యాణ మహోత్సవంలో భాగంగా నాలుగోరోజున శ్రీ స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పరివార దేవతార్చనలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణం వద్ద ప్రారంభమైన రథోత్సవం….శ్రీ వేణుగోపాల స్వామి మందిరం వరకు కొనసాగింది.

Share this post with your friends