భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో స్వామివారి నిత్యకల్యాణం వైభవంగా జరిగింది. స్వామివార్ల కల్యాణమూర్తులను అంతరాలయం నుంచి నిత్య కల్యాణ మండపానికి తెచ్చారు. కల్యాణమూర్తులకు అర్చకులు తొలుత విశ్వక్సేన ఆరాధన, మాంగల్య పూజ, పసుపు కుంకుమ పూజ నిర్వహించారు. అనంతరం మాంగల్యధారణ క్రతువు కమనీయంగా జరిగింది. ఈ క్రతువులో పాల్గొన్న భక్తులు…. స్వామివార్లకు కట్నకానుకలు సమర్పించారు.
2024-03-31