గోకవరంలో ఆలయ పునః ప్రతిష్టాపనోత్సవాలు

తూర్పుగోదావరి జిల్లా… గోకవరంలోని శ్రీ రమా సత్యనారాయణ స్వామి వారి ఆలయ శిఖర పునః ప్రతిష్టా మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గోపూజ, కలశ పూజలను అర్చక స్వాముల సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కలశాల ఊరేగింపులో మహిళలు పాల్గొన్నారు. కలశాల ఊరేగింపు నేత్రపర్వంగా కొనసాగింది.

Share this post with your friends