టిటిడికి అనుబంధంగా ఉన్న పురాతనమైన ప్రముఖ పుణ్యక్షేత్రం ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామ స్వామి వారి ఆలయంలో ఈ నెల 17 నుంచి 25వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తాం. ఏప్రిల్ 22వ తేదీన శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవం సాయంత్రం 6.30 నుండి 8.30 గంటల వరకు జరుగుతుంది. భక్తుల సౌకర్యార్థం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాం. భక్తులు విచ్చేసి బ్రహ్మోత్సవాల వైభవాన్ని తిలకించి ఆ కోదండరాముని అనుగ్రహానికి పాత్రులవ్వండి.
2024-04-05