శ్రీ సత్యసాయి జిల్లా జిల్లా కదిరిలోని శ్రీ ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన బ్రహ్మ రథోత్సవం నేత్రపర్వంగా కొనసాగింది. తొలుత రథం వద్ద ఆర్చకులు పూజా కైంకర్యాలు గావించారు. అనంతరం భక్త జన సందోహం కోలాహలం నడుమ రథం ముందుకుసాగింది. తిరుమాడ వీధుల్లో స్వామివారు విహరిస్తుండగా భక్తులు దర్శించుకుని పులకితులయ్యారు. కదిరివాసా గోవిందా అంటూ భక్తులు నినదించారు. ఈ రథోత్సవాన్నితిలకించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు, కేరళ నుంచి దాదాపు లక్ష మంది భక్తులు తరలివచ్చారు.
2024-03-30